ఎన్నికలపై మోదీ, రాహుల్ లైవ్ డిబేట్!

-

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మరో రెండ్రోజుల్లో నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజకీయం రంజుగా మారింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య బహిరంగ చర్చ జరగాలని ‘ది హిందూ’ పత్రిక మాజీ ఎడిటర్‌ ఎన్‌.రామ్‌, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, దిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్‌ ఎ.పి.షా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, రాహుల్‌కు వీరు లేఖ రాశారు.

ఇలాంటి చర్చ, వాణిజ్య ప్రయోజనాలకు దూరంగా, పక్షపాత రహితమైన వేదిక మీద జరగాలని వీరంతా లేఖలో కోరారు. ఇలాంటి అగ్ర నాయకుల మధ్య డిబేట్, ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఆరోగ్యకరమైన, శక్తిమంతమైన ప్రజాస్వామ్య వాస్తవ చిత్రాన్ని ఆవిష్కరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ ఇద్దరు నేతలకు బహిరంగ చర్చలో పాల్గొనేందుకు వీలుకాకపోతే తమ తరఫున ప్రతినిధులను పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ విషయం దేవశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news