ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌.. 5.5 కోట్ల మందికి ఈ ప్యాక్ ఉచితం

-

ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు ఓ శుభవార్త తెలిపింది. కరోనా నేపథ్యంలో తమ వినియోగదారులకు ఉచితంగా ఓ ప్యాక్ అందిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో తమ నెట్‌వర్క్‌ ను కనెక్టివిటీని కొనసాగించేలా 49 రూపాయల ప్యాక్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ ఆదివారం ప్రకటించింది.

తక్కువ ఆదాయం కలిగిన 5.5 కోట్ల మంది వినియోగదారులకు ఈ ప్యాక్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా కంపెనీ రూ.270 కోట్ల వ్యయం భరించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమవంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల మధ్య కనెక్టివిటీ ఉండటానికి, అవసరమైనప్పుడు సమాచారాన్ని పొందడానికి ఈ ప్యాక్ సహాయపడుతుందని వివరించింది.

ఈ ఉచిత ప్యాక్ ద్వారా 5.5 కోట్ల మంది ఎయిర్‌టెల్‌ వినియోగదారులు రూ.38 టాక్‌టైమ్‌తో పాటు, 100 ఎంబీ ఉచిత డేటాను 28 రోజుల పాటు వినియోగించుకోవచ్చవని ఎయిర్‌టెల్‌ స్పష్టం చేసింది. అలానే రూ.79 రీచార్జ్‌ కూపన్‌ కొనుగోలు చేసిన వారికి రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయని వెల్లడించింది. ఈ రెండు బెనిఫిట్స్‌ కూడా వచ్చే వారంలో ప్రీ-పెయిడ్‌ కస్టమర్లకు లభిస్తాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news