తెలంగాణ గవర్నర్‌కు బండి సంజయ్ లేఖ

-

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ కు లేఖ రాసారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్ళారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ లో కరోనా చికిత్స ఉచితంగా అందిస్తున్నట్టు ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రంలో కరోనా చికిత్స ఉచితంగా అందించాలని అన్నారు.

2….

ఇక కరోనాను ఎదుర్కోవడంలో కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేవని, దీంతో పేదలు, మధ్య తరగతి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకునేందుకు పేదలు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్న అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పి దాదాపు ఏడాది అవుతుందని… అయిన ఇంతవరకు అమలు చేయకపోవడానికి గల కారణమేంటని ప్రశ్నించారు.

ఏడాది కాలంగా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలన్న డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ చికిత్సలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలానే ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news