కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తర్ ప్రదేశ్లో కొనసాగుతోంది. ఆగ్రాకు చేరుకున్న ఈ యాత్రలో ఇవాళ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసి పోటీ చేసే విషయమై విపక్ష పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఒప్పందం కుదిరడంతో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు.
యాత్ర ఆగ్రాకు చేరుకున్న సమయంలో అఖిలేశ్ పాల్గొని రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో వేదికపై ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర మొదలైన అనంతరం విపక్ష పార్టీలకు చెందిన ఓ కీలక నేత ఇందులో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. యూపీలో కాంగ్రెస్ 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించగా.. ఎస్పీ 63 చోట్ల పోటీ చేయనుంది.