ఎల్ ఐసీ అంటే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వం భీమా సంస్థ. దీనికి దాదాపు 40కోట్ల మంది వరకు కస్టమర్లు ఉన్నారు. అలాంటి సంస్థలో మే10నుంచి పెను మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు వారానికి ఆరు రోజులు పనిచేసిన ఎల్ ఐసీ రేపటి నుంచి పనిదినాలను కుదించింది.
ఇక నుంచి శనివారం కూడా సంస్థకు సెలవు ప్రకటించింది. అంటే వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు కేవలం ఐదు రోజులు మాత్రమే సంస్థ పనిచేయనుంది. ఏప్రిల్ 15న కేంద్ర ప్రభుత్వం దీనిని సిఫార్సు చేయాలంటూ నోటిఫికేషన్ పంపింది.
దీనిపై సంస్థ స్పందిస్తూ రేపటి నుంచి నిబంధనలు వర్తిస్తాయంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అవసరమైతే Https://licindia.in/ వెబ్సైట్ను సంప్రదించాలని కోరింది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అన్ని సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది సంస్థ. కరోనా ఉన్నన్ని రోజులు ఇవే నిబంధనలు ఉంటాయని పేర్కొంది.