కేంద్ర ఉద్యోగాలన్నీ ఇక నాలుగేళ్లే.. అన్ని కాంట్రాక్ట్ జాబ్‌ లే !

-

రానున్న రోజుల్లో అగ్నిపథ్ తరహాలో నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతిని దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలు అలాగే ఇతర ఉద్యోగాల్లో ప్రవేశపెట్టేందుకు మోడీ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లోపకారిక నిర్ణయం జరిగిందని.. తొలుత పైలెట్ గా సైనిక నియామకాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫలితాలను బేరీజు వేయాలని లక్ష్యంతోనే పనిచేస్తోందని అభిప్రాయాలు దేశమంతా వినిపిస్తున్నాయి. ఈ దేశమైనా దేశ రక్షణకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంది. కొన్ని దేశాలు నిర్బంధంగా పౌరులను రక్షణ రంగంలో కి తీసుకుంటాయి.

దేశ రక్షణకు కీలకమైన అంశం కావడంతో ఈ నియామకాలను భారంగా పరిగణించకుండా వ్యవహరిస్తు ఉంటాయి. ఇందుకు భారీ బడ్జెట్ తో నిధులను కేటాయించుకుoటున్నాయి. అయితే ఆయా బడ్జెట్ ను కొన్ని దేశాలు బడ్జెట్ లో పైకి కనిపించకుండా చర్యలు తీసుకుంటాయి. కానీ అందుకు భిన్నంగా భారత సైన్యానికి చెందిన కేటాయింపులు, వేతనాలు, పింఛన్లు,రిటైర్మెంట్ ప్యాకేజీలను భారత ప్రభుత్వం బయటపెట్టింది.

వీటిని తగ్గించుకునేందుకు ఈ అగ్ని పథకాన్ని తీసుకు వచ్చినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటన వెనుక అసలు ఉద్దేశం వేరు గా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా నియామకాల్లో ఇకపై కాంట్రాక్టు పద్ధతిని మరియు నాలుగేళ్ల గడువు కామన్ కానుందనే అభిప్రాయం పలువురు వెలిబుచ్చుతున్నారు. అందుకే మొదట ఆర్మీ విభాగంలో అగ్ని పథకాన్ని అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version