77వ స్వాతంత్ర్య దినోత్సవాలకు సర్వం సిద్ధం

-

భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో 2023 ఆగస్టు 15న ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, చరిత్రాత్మక స్మారకం బురుజుల నుంచి పౌరులనుద్దేశించి సంప్రదాయ ప్రసంగం చేస్తారు. అలాగే 2021 మార్చి 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల సబర్మతి ఆశ్రమం నుంచి ప్రధాని ప్రారంభించిన ‘స్వాతంత్ర్య అమృత మహోత్సవ’ వేడుకలు ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవంతో పరిసమాప్తమవుతాయి.

తద్వారా భారతదేశం మరోసారి ‘అమృత కాలం’లోకి ప్రవేశిస్తుంది. ఈ మేరకు 2047కల్లా దేశాన్ని ‘వికసిత భారతం’గా రూపుదిద్దాలన్న శ్రీ నరేంద్ర మోదీ కలను సాకారం చేసే సంకల్పం పునరుత్తేజం పొందుతుంది. ఈసారి 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అనేక కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు నిరుటితో పోలిస్తే ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు. ఎర్రకోట వద్ద నిర్వహించే వేడుకలలో పాల్గొనేందుకు వివిధ రంగాల నుంచి జీవిత భాగస్వాములుసహా సుమారు 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ‘

జన భాగస్వామ్యం’ పేరిట ప్రభుత్వం అనుసరిస్తున్న దార్శనిక కార్యక్రమానికి అనుగుణంగా ఈ ఆహ్వానం పంపబడింది. ఈ ప్రత్యేక అతిథులలో ఉజ్వల గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు సహా 660 మందికిపైగా ఆహ్వానితులున్నారు. అలాగే రైతు ఉత్పత్తిదారు సంస్థల నుంచి 250 మంది; ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం-ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం కింద 50 మంది వంతున కొత్త పార్లమెంట్ భవనంసహా సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న 50 మంది శ్రమ యోగులు (కార్మికులు); సరిహద్దు రోడ్ల నిర్మాణం,

అమృత సరోవరాల తవ్వకం, ఇంటింటికీ నీరు పథకం వగైరాలలో పాల్గొన్న 50 మంది ఖాదీ కార్మికులు; ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారుల నుంచి 50 మంది వంతున వీరిలో ఉన్నారు. ఈ ప్రత్యేక అతిథులలో కొందరు జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించడంతోపాటు రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్‌తో భేటీ అవుతారు. వీరే కాకుండా ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం నుంచి 75 జంటలు సంప్రదాయ వస్త్రధారణతో ఎర్రకోటలో వేడుకలు తిలకించేందుకు ఆహ్వానించబడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news