‘ఆ కేసుల్లో శిక్షపడితే శాశ్వతంగా చట్టసభల్లో నిషేధించాలి’

-

కొంత మంది రాజకీయ నేతలపై ఎంత పెద్ద కేసులు ఉన్నా వారు తమ పదవుల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. అత్యాచారం, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల వంటి క్లిష్టమైన కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై చర్యలు తీసుకోవాలనే వాదనలు ఎన్నాళ్ల నుంచో వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతల విషయంలో కఠినంగా వ్యహరించాలని సీనియర్‌ న్యాయవాది, అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా సుప్రీంకోర్టుకు సూచించారు. నైతికపరమైన అంశాలు ఇమిడి ఉన్న కేసుల్లో శిక్షపడిన చట్టసభ సభ్యులను జీవితాంతం ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీనికి సంబంధించి ఓ నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి అందించారు.

ప్రజాప్రతినిధులుపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణను త్వరితగతిన నిర్వహించాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హన్సారియా అమికస్‌ క్యూరీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఈ పిటిషన్‌ సుప్రీకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన తన 19వ నివేదికను సమర్పించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల క్రిమినల్‌ కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు.. ఎన్ని కేసులు విచారణ ముగించాయనే దానిపై నెలవారీ నివేదికలు సమర్పించేలా హైకోర్టులు చూడాలని నివేదికలో పేర్కొన్నారు. ప్రతి జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి… ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను కేటాయించేటప్పుడు ఇప్పటికే ప్రత్యేక కోర్టు ఎదుట ఉన్న కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎంపీలు/ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలపై.. ప్రత్యేకంగా తమ వెబ్‌సైట్‌లో హైకోర్టులు ప్రస్తావించాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news