ఆ నలుగురు స్టార్‌ హీరోలకు షాక్‌.. రెడ్ కార్డ్ జారీ చేయనున్న నిర్మాతల మండలి!

-

స్టార్ హీరోలకు తమిళ్ చిత్ర నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. ధనుష్‌, విశాల్‌, అథర్వ, శింబులకు రెడ్‌ కార్డు జారీ చేయాలని ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయించింది. ఈ నలుగురు హీరోలకు పలు కారణాలతో రెడ్ కార్డు జారీ చేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ తెలిపింది. తెనందాల్‌ నిర్మాణ సంస్థలో ఓ సినిమాకు అంగీకరించిన ధనుష్‌ 80 శాతం షూట్‌ పూర్తయ్యాక చిత్రీకరణ విషయంలో ఆయన ఆసక్తి కనబరచలేదని.. దాని వల్ల నిర్మాతకు నష్టాలు వచ్చాయని.. అందుకే ధనుష్​పై చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మాతల మండలి తెలిపింది.

మరోవైపు హీరో విశాల్.. ప్రొడ్యూసర్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో అసోసియేషన్‌ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయనకు రెడ్‌ కార్డు ఇవ్వనున్నారు. నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో ఎన్నో సార్లు చర్చలు జరిపినా శింబు తీరు మార్చుకోకపోవడంతో రెడ్‌ కార్డు జారీ చేయాలని నిర్ణయించినట్లు నిర్మాతల మండలి వెల్లడించింది. మదియలకన్‌ నిర్మాణ సంస్థతో సినిమా ఒప్పుకున్న హీరో అథర్వ షూటింగ్‌ విషయంలో ఏమాత్రం సహకరించడం లేదనే ఆరోపణలతో అథర్వకు రెడ్‌ కార్డు ఇవ్వనున్నట్లు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news