బిజేపీ చుట్టూ పథకం ప్రకారం కుట్ర జరుగుతోందా..? రైతుల కోసం కమలం చేసిన సంస్కరణలేంటి…?

-

దేశంలో మూడోసారి అధికారంలోకి బిజేపీ.. రైతుల సంక్షేమానికి, వారి ఆర్దికాభివృద్దికి ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చింది.. వ్యవసాయ విధానాలను అమలు చేసింది.. మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి.. వాటి ప్రాధాన్యతను వివరించే క్రమంలో కొన్ని అదృశ్య శక్తులను వాటిని వ్యతిరేకించాయి.. రాజకీయ లబ్ది కోసం రైతులను రెచ్చగొట్టి.. రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూశాయి.. కానీ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం వెనక్కితగ్గలేదు..

కార్పొరేట్ శక్తుల కోసమే నల్లచట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని విపక్షాలు అసత్య ప్రచారాలు చేసినా.. మోడీ రైతులను మేలు చేశారని వ్యవసాయ రంగ నిపుణులు చెప్పుకొచ్చారు.. రైతులు ఎక్కువగా ఉన్న పంజాబ్, హర్యానా రాష్టాల్లో నిరసనలు వ్యక్తం అయినా.. వాటి వల్ల లబ్ది పొందిన రైతులే ఎక్కువగా ఉన్నారనేది బిజేపీ వాదన..

ఇతర దేశాలను భారతదేశం అన్నపూర్ణగా నిలవాలని దేశ ప్రధాని మోదీ భావించారు.. వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేసేందుకు రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు.. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌ల వెలుపల విక్రయించడానికి అనుమతించడం, కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ప్రారంభించడం మరియు అవసరమైన వస్తువులపై స్టాక్ హోల్డింగ్ పరిమితులను తొలగించడం వంటివి చట్టాలు లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఈ సంస్కరణలు రైతులకు ఎక్కువ మార్కెట్ యాక్సెస్ మరియు ధరల సౌలభ్యానికి ఉపయోగపడ్డాయి.. దళారుల దోపిడీకి రైతులు గురి కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించింది..

రైతుల్లో లేనిపోని అపోహలను విపక్షాలు సృష్టించాయి.. బీజేపీని రైతు వ్యతిరేకిగా ముద్ర వేసేందుకు ఓ వర్గం మీడియాను సైతం వాడుకున్నాయి..
వ్యవసాయ చట్టాలతో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూనే వచ్చింది.. ఇటీవల 13,966 కోట్లతో ఏడు కీలక పథకాలకు ఆమోదం తెలిపింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కి 2,817 కోట్లు కేటాయించారు.

ఈ పథకాలకు ఇటీవలి ఆమోదం లభించడంతో మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీల గొంతులో ఎలక్కాయ్ పడినట్లు అయింది.. కాంగ్రెస్ హయంలో కంటే బీజేపీ హయాంలోనే రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని లెక్కలు చెబుతున్నాయి.. హర్యానా వంటి రాష్టాల్లో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి బీజేపీ సంస్కరణలు ఉపయోగపడతాయి అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news