తెలంగాణ రాష్ట్ర సాధన కు పోరాడి.. ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పని చేసిన కొణతం దిలీప్ నీ పోలీసులు అక్రమ నిర్బంధం చేశారు. గత 5 గంటలు గా బంధించారు. దాంతో దిలీప్ మనోవేదనకు గురయ్యారు అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పమంటే… మేము అరెస్ట్ చేయలేదు.. విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఆయన పెట్టిన వార్త పైన విచారణ చేస్తున్నమంటున్నారు.
అయితే దాని వల్ల శాంతి భద్రతలకు ఎక్కడ భంగం జరిగిందో పోలీసులు చెప్పాలి. పై నుంచి వచ్చే ఆర్డర్ల ప్రకారం పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ హామీ నీ అమలు చేయడం లేదు. ఈ ప్రభుత్వం వరదల విషయంలో విఫలమైంది. వరదల్లో ఎక్కడ మంత్రులు కనిపించలేదు. కొందరు సినిమాలు చూసుకుంటూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో నిజాలు చెప్పేవారిని ప్రభుత్వం వేధిస్తుంది. దిలీప్ నీ వెంటనే రిలీజ్ చేయాలి అని జగదీష్ రెడ్డి డిమాండ్ చేసారు.