మరణించిన వాళ్లు దహనసంస్కారాలు చేసేటప్పుడు తిరిగి బతికొచ్చారని అప్పుడప్పుడు వార్తలు చదువుతుంటాం. అచ్చం అలాంటి సంఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిం ది. మరణించిందని వైద్యులు ప్రకటించిన ఓ వృద్ధురాలిని శ్మశానానికి తీసుకువెళ్తుంటే కళ్లు తెరిచిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..?
ఫిరోజాబాద్ జిల్లా బిలాస్‌పుర్ గ్రామంలో హరిభేజీ(81) అనే వృద్ధురాలు నివాసం ఉండేది. అనారోగ్యం కారణంగా డిసెంబరు 23న ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. బ్రెయిన్ డెడ్ అయ్యి ఆమె మరణించినట్లు 24న వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లి అంత్యక్రియలకు శ్మశానానికి తీసుకువెళ్తుంటే దారిలో అకస్మాత్తుగా ఆమె కళ్లు తెరిచింది. కానీ ఆ వృద్ధురాలు ఆ మర్నాడే చనిపోయింది.