ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. సంక్రాంతికి బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక సర్వీస్లు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రైవేట్ వాహనాల్లో అదనపు ఛార్జీలు చెల్లించి, ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు సూచించారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు తిరుగుప్రయాణానికి సైతం ముందే టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ అందిస్తున్నట్లు సజ్జనార్ వివరించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్ణణాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీస్లను నడిపేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రద్దీకి అనుగుణంగా సర్వీస్లు పెంచాలని ఆదేశించారు. హైదరాబాద్ ఎమ్జీబీఎస్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. సంక్రాతికి రానుపోనూ ఒకేసారి ఆర్టీసీ బస్సులో, టికెట్ బుక్ చేసుకున్న వారికి తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీని కల్పిస్తున్నామని, ప్రజలు రాయితీని వినియోగించుకోవాలని సజ్జనార్ సూచించారు.