BREAKING : అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపు కాల్

-

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌లోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు బుధవారం మధ్యాహ్నం 12.57 గంటలకు ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని ముంబయి పోలీసులు తెలిపారు. రిలయన్స్ ఆస్పత్రిని పేల్చేస్తామని దుండగుడు బెదిరించాడని వెల్లడించారు. అంబానీ కుటుంబానికి చెందిన కొంతమంది సభ్యుల పేర్లు చెప్పి మరీ బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.

ఇంతకుముందే.. ఆగస్టు 15న కూడా అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. అంబానీతో పాటు ఆయన కుటుంబాన్ని 3 గంటల్లో చంపేస్తామని ఓ ఆగంతుకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబర్​కు ఈ కాల్ వచ్చినట్లు చెప్పారు. ఏకంగా ఎనిమిది సార్లు దుండగుడు బెదిరింపు కాల్స్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

బెదిరింపు కాల్స్​పై ఆస్పత్రి వర్గాలు డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. వెంటనే అంబానీ నివాసానికి పెద్ద సంఖ్యలో సిబ్బందిని పంపారు. ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా ముంబయి దహిసర్​లో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version