జమ్మూకశ్మీర్లో జనావాసాల మధ్య ఉగ్రవాదుల బంకర్లు.. వీడియో వైరల్

-

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఇటీవల జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనావాసాల మధ్యలో ఉగ్రవాదులు బంకర్లు ఏర్పాటు చేసుకొంటున్నట్లు అధికారులు గుర్తించారు. చిన్నిగామ్‌ ఫీసల్‌లో ఓ ఇంట్లో ఉన్న కప్‌బోర్డ్‌లో ఉగ్రవాదులు ఏకంగా బంకర్‌ నిర్మించుకొన్నట్లు భద్రతా దళాలు గ్రహించాయి.

ఈ బంకర్ను పూర్తిగా కాంక్రీట్‌తో నిర్మించారు. చిన్నదిగా ఉన్నా సౌకర్యవంతంగా ఉంది. దీనిలోకి వెళ్లడానికి బయట నుంచి చిన్న అల్మారా వంటి దానిలో ద్వారం ఏర్పాటు చేశారు. ఒక మనిషి పాక్కొంటూ బంకర్‌లోకి ప్రవేశించవచ్చు. అని సైనిక దళాలు పేర్కొన్నాయి. ఇక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు, ఓ పారాకమాండో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్ర దాడుల వెనక లష్కరే నేత సైఫుల్లా సాజిద్‌ జట్‌ హస్తం ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం. అతడిపై రూ.10 లక్షల రివార్డు కూడా ఉంది. అతడు పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతడే లష్కర్‌ ఆపరేషనల్‌ కమాండర్‌గా పనిచేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news