కాలుష్యం తగ్గించేందుకు దిల్లీలో 20న కృత్రిమ వాన!

-

దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్ర తరం అవుతోంది. ఇప్పటికే హస్తినలో సరి బేసి విధానంలో రవాణా నియమాలు విధించింది అక్కడి సర్కార్. మరోవైపు పాఠశాలలకు సెలవులు కూడా ఇచ్చారు. అయినా అక్కడ కాలుష్యం ఇంకా తగ్గడం లేదు. దిల్లీలో వాయు కాలుష్యం సూచీ(ఏక్యూఐ) వరుసగా రెండో రోజూ 400 దాటినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ)  తెలిపింది. ఈ పరిస్థితి దీపావళి ముందు మెరుగుపడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

దిల్లీలో గురువారం రోజున ఏక్యూఐ 437గా నమోదవ్వగా.. బుధవారం (426)తో పోలిస్తే మరింత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దిల్లీ చుట్టుపక్కల నగరాలైన గాజియాబాద్‌ (391), గురుగ్రామ్‌ (404), నోయిడా (394), గ్రేటర్‌ నోయిడా (439), ఫరీదాబాద్‌ (410)ల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వెల్లడించారు.

మరోవైపు ఈ వాయు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు కృత్రిమ వానల అంశాన్ని దిల్లీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్రం ఆమోదం తెలిపితే ఈ నెల 20వ తేదీన ఐఐటీ కాన్పుర్‌తో కలిసి చర్చించిన తర్వాత వానలు కురిపిస్తామని దిల్లీ అధికారులు చెబుతున్నారు. ఇందుకయ్యే ఖర్చంతా తామే భరిస్తామని రాష్ట్ర సర్కార్ వెల్లడించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news