దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా సహా పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. వారిని ఈడీ అధికారులు విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవలే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈ పరిణామంతో ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
అయితే తాజాగా ఈ కేసులో నిందితుడిగా అరుణ్ పిళ్లై.. ఈడీ అధికారులు బెదిరించడంవల్లే ఎమ్మెల్సీ కవిత పేరు చెప్పినట్లు ఆయన తరుఫు న్యాయవాది శుక్రవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదించారు. బెయిల్ కోసం పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగినప్పుడు ఈ మేరకు పేర్కొన్నారు. విచారణకు పిలిచి స్టేట్‌మెంట్ రికార్డు చేసే సమయంలో అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో పిళ్లైకవిత పాత్ర ఉన్నట్లు చెప్పిన పేపర్‌పై సంతకాలు చేశారన్నారు.
అందుకే ఆ వెంటనే తన స్టేట్‌మెంట్‌ను వెనక్కు తీసుకొనేందుకు అనుమతివ్వాలని కోరుతూ రిట్రాక్షన్ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు గుర్తుచేశారు. మద్యం కేసులో ఆధారాలు లేకపోయినా ఈడీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, అందువల్ల బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. న్యాయమూర్తి నాగ్‌పాల్ కేసును జూన్ 8కి వాయిదా వేశారు