ఆర్ఆర్ఆర్.. సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో తెలిసిందే. ఇక ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏకంగా ఈ పాట ఆస్కార్ గెలుచుకుందంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎక్కడ చూసినా చర్చ నాటు నాటు పాట గురించే.. అందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు. సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు అందరూ చిందులేశారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా అక్కడ ఈ పాటకు స్టెప్పులు వేయాల్సిందే అన్నంతలా మారిపోయింది.
ఇటీవల జమ్ముకశ్మీర్‌లో నిర్వహించిన జీ20 సదస్సు వేదికపైనా ఈ పాటకు స్టెప్పు లేశారు. అయితే ఈ ఒరిజినల్ సాంగ్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అధికారిక నివాసం ఎదుట ఆగస్టు 2021లో చిత్రీకరించారు. తాజాగా ఇప్పుడు అదే చోట ఈ సాంగ్‌పై ఉక్రెయిన్ సైనికులు డ్యాన్స్ చేశారు. దాదాపుగా అవే స్టెప్పులతో అదరగొట్టారు. అయితే వీరు తమపై దాడి చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా పాటను చిత్రీకరించారు. పాటలో సైనికులు డ్రోన్స్ ఎగురవేస్తున్నట్లు కనిపించింది.
Військові з Миколаєва зняли пародію на пісню #NaatuNaatu з 🇮🇳 фільму "RRR", головний саундтрек якого виграв Оскар цього року.
У оригінальній сцені гол.герої піснею виражають протест проти британського офіцера (колонізатора) за те, що він не пустив їх на зустріч. pic.twitter.com/bVbfwdjfj1
— Jane_fedotova🇺🇦 (@jane_fedotova) May 29, 2023