ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైన ఊరట దక్కలేదు. సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్ పై తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. కేజ్రీవాల్ అరెస్ట్ అంశం లో పలు అంశాలను సెక్షన్లను పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది సుప్రీం కోర్టు.
అరెస్ట్ అక్రమం అని కేజ్రివాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం. ఇక ఈ తరుణంలోనే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైన ఆయనకు ఊరట లభించలేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కానీ మరోవైపు సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు ఇంకా బెయిల్ రాకపోవడంతో.. ఆయన కస్టడీలోనే కొనసాగనున్నారు.