సీఎం రేవంత్ మీద మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎంలు కేజ్రీవాల్, కేసీఆర్‌లను చూసి కూడా ప్రధాని మోడీతో పెట్టుకుంటావా? అని డీకే అరుణ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ కులంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి.
‘ప్రధాని బీసీ కాదని..ఆయనో కన్వర్టెడ్ బీసీ’అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు వరుసగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా డీకే అరుణ స్పందిస్తూ.. అసలు మోడీ కుటుంబం గురించి మాట్లాడేందుకు సీఎం రేవంత్ ఎవరని మండిపడ్డారు.అసలు ఆయనకు ఏం అర్హత ఉందని ప్రధానిపై కామెంట్ చేశారని విమర్శించారు. సీఎం కాకపోతే రేవంత్‌ను ఎవరూ పట్టించుకునే వారు కాదని, ఎవరి మెప్పుకోసం రేవంత్ ఇలా మాట్లాడుతున్నారని డీకే అరుణ నిలదీశారు.