అసోం సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ దేశాలను కలపాలంటూ..

-

బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా భారత్‌లో పర్యటిస్తోన్న వేళ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ను విమర్శించే క్రమంలో బంగ్లాదేశ్ను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లను తిరిగి మన దేశంలో కలపాలంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.

భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శించబోయిన హిమంత.. ‘‘భారత్‌ ఇప్పుడు ఐక్యంగానే ఉంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. సిల్చార్‌ నుంచి సౌరాష్ట్ర వరకు మనమంతా ఒకటే. ఈ దేశాన్ని కాంగ్రెస్సే భారత్, పాకిస్థాన్‌గా విభజించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఒకవేళ తన కుటుంబం చేసిన తప్పులకు రాహుల్‌ బాధపడితే.. మన దేశంలో ‘భారత్‌ జోడో’ చేపట్టడం కాదు.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లను ఏకీకృతం చేసి అఖండ్‌ భారత్‌ కోసం కృషి చేయాలి’’ అని వ్యాఖ్యానించారు.

అయితే బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌లో పర్యటిస్తోన్న సమయంలో హిమంత ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news