కుప్పంలో ఢోకా లేదంటా..!

-

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు కంచుకోట అయిన కుప్పంపై ఫోకస్ చేసి జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. కుప్పంలో ఈసారి ఎలాగైనా చంద్రబాబుని ఓడించాలనే దిశగా వైసీపీ రాజకీయం నడిపిస్తూ వస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తూ..అక్కడ చంద్రబాబు బలం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే స్థానిక ఎన్నికల్లో, కుప్పం మున్సిపాలిటీలో వైసీపీని గెలిపించి…చంద్రబాబులో టెన్షన్ పెంచారు. ఈ దెబ్బకు చంద్రబాబు కూడా మూడు నెలకొకసారి కుప్పం పర్యటనలు చేస్తూ, అక్కడ పార్టీ పరిస్తితుల్ని సరిదిద్దుకుంటున్నారు.

అయితే ఈ సారి ఖచ్చితంగా కుప్పం గెలుస్తామని వైసీపీ నేతలు సవాళ్ళు విసురుతున్నారు. కానీ సవాల్ విసిరినంత ఈజీగా కుప్పంని గెలవడం వైసీపీకి ఈజీ కాదని పలు సర్వేల్లో తేలింది. తాజాగా వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో కూడా తేలింది. కుప్పంలో మళ్ళీ చంద్రబాబు గెలుస్తారని చెప్పింది.

వైసీపీకి అధికార బలం తప్పితే..అక్కడ చంద్రబాబుని ఓడించే బలం లేదని తెలిసింది. పైగా చంద్రబాబుని టార్గెట్ చేసినందుకు…అక్కడ ప్రజలు బాబుపై సానుభూతి ఉన్నారట.

ఇక గత ఎన్నికల మాదిరిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో జిల్లాలో…వైసీపీకి అనుకూలంగా ఉన్నవి..పూతలపట్టు, పుంగనూరు, చంద్రగిరి, జీడీ నెల్లూరు, తిరుపతి సీట్లు. టీడీపీకి అనుకూలంగా ఉన్నవి…కుప్పం, నగరి, మదనపల్లె, సత్యవేడు, పలమనేరు సీట్లు.

ఇక పీలేరు, తంబళ్ళపల్లె, శ్రీకాళహస్తి సీత్ల్లో టీడీపీ-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయని సర్వేలో తేలింది. అంటే మొత్తం 14 సీట్లలో వైసీపీ 6 సీట్లు, టీడీపీ 5 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. 3 సీట్లలో టఫ్ ఫైట్. ఇక ఇందులో పీలేరు, తంబళ్ళపల్లెలో టీడీపీకి ఎడ్జ్ ఉందట. కాళహస్తిలో వైసీపీకి ఎడ్జ్ ఉందట. మొత్తానికి చూసుకుంటే ఈ సారి చిత్తూరులో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news