అస్సాంపై ప్రకృతి ప్రకోపం…. తుఫాన్, పిడుగుల ధాటికి 14 మంది మృతి

-

అస్సాం రాష్ట్రంపై ప్రకృతి పగబట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో పాటు పిడుగు పాటులతో పలువురు మరణించారు. ఇప్పటి వరకు 14 మంది మరణించారు. గురువారం నుంచి అస్సాంలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 48 గంటల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా 12 జిల్లాల్లో 592 గ్రామాలు. 20,300 మంది ప్రజలుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

తుఫాన్ కారణంగా దిబ్రూగఢ్, బర్పేట, కమ్రూప్ (మెట్రో), కమ్రూప్ (రూరల్), నల్బరి, చిరాంగ్, దర్రాంగ్, కాచర్, గోలాఘాట్, కర్బీ అంగ్లాంగ్, ఉదల్‌గురి, గోల్‌పరా జిల్లాల్లో వర్షాల ధాటికి అతలాకుతలం అయ్యాయి. అనేక చెట్లు, విద్యుత్ స్తంబాలు నెలకూలాయి. అధికారుల అంచనా ప్రకారం 7400 ఇళ్లు దెబ్బతిన్నాయి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసింది. వర్షాల ప్రభావంతో మరింతగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version