దిల్లీ లిక్కర్ స్కామ్‌లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలై ప్రస్తుతం బయటే ఉన్న ఆయన తాజాగా ఓ షాక్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తాను అప్రూవర్‌గా మారుతున్నట్లు ప్రకటించారు.
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారారు. శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారేందుకు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించినట్లు తెలుస్తోంది. వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ ఏర్పాటు చేసుకొని అవినీతి మార్గంలో సొమ్ము కూడగట్టుకొని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారన్న అభియోగాలపై శరత్‌చంద్రారెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో ఈ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో బడా వ్యాపారాలు.. ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పలుమార్లు ఈడీ వారిని విచారించింది కూడా. ఏకంగా దిల్లీ డిప్యూటీ సీఎంను ఈ వ్యవహారంలో అరెస్టు కూడా చేసింది. ఇక ఈ కేసులో గతంలోనే ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు కూడా అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే.