టి20 ప్రపంచ కప్ 2021 లో భాగంగా ఇవాళ మెగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మెగా ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుండగా కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ పూర్తి అయింది. అయితే ఇందులో టాస్ నెగ్గిన ఆసీస్.. మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేయనుంది న్యూజిలాండ్ జట్టు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(సి), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(w), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(సి), టిమ్ సీఫెర్ట్( w), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్