AKANDA TRAILER : “అఖండ” ట్రైలర్ రిలీజ్.. బ్రేకులు లేని బుల్ డోసర్ వచ్చేసింది

-

టాలీవుడ్ హీరో బాలయ్య… ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న అఖండ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా అఖండ టీం విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో నందమూరి బాలయ్య.. తన డైలాగులతో అందరికీ పిచ్చెక్కించేసాడు. అలాగే తన పర్ఫామెన్స్ తో… అందర్నీ ఆకట్టుకున్నాడు.బ్రేకులు లేని బుల్ డోసర్ ను.. తొక్కి పరాదోబ్బుతానంటు బాలయ్య చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. అలాగే జగపతి బాబు, శ్రీకాంత్ డైలాగులతో ఆకట్టుకున్నారు.

కాగా నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హైట్రిక్ మూవీగా అఖండ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. మిరియాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news