ప్రాణప్రతిష్ఠ వేళ.. అయోధ్యకు చేరుకుంటున్న అతిరథమహారథులు

-

అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు మరికొద్ది క్షణాలే ఉంది. ఈ బృహత్కర ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు యావత్ భారతావని వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న ప్రముఖులు ఒక్కొక్కరిగా అయోధ్య చేరుకుంటున్నారు. మరోవైపు ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని వారంతా ఇళ్లలో టీవీలకు అతుక్కుపోయి ప్రత్యక్ష ప్రసారాన్ని వేడుకగా తిలకిస్తున్నారు.

మరోవైపు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీతారలు, క్రీడాకారులు, సాధువులు ఒక్కొక్కొరుగా రామజన్మ స్థలానికి విచ్చేస్తున్నారు. ఇప్పటికే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, సినీనటులు రజనీకాంత్, పవన్ కల్యాణ్ అయోధ్యకు చేరుకున్నారు. కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్, బాలీవుడ్ సినీ దర్శకుడు మధుర్ భండర్ కర్, నటి కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్, ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే రాముడి జన్మస్థలంలో అడుగుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version