అయోధ్య రామ మందిరం గురించి ఈ విషయాలు తెలుసా?

-

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారులు రంగం ప్రారంభోత్సవ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య ఆలయం గురించి కొన్ని ప్రత్యేక విశేషాలను శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్ట్‌ ప్రజలతో షేర్ చేసుకుంది. మరి ఆ విశేశాలేంటంటే?

380 అడుగులు (తూర్పు నుంచి పడమర) పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

మూడు అంతస్తుల్లో ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఆలయానికి 392 స్తంభాలు, 44 గేట్లు ఏర్పాటు చేస్తున్నారు.

మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్‌తోపాటు ప్రధాన ఆలయం గర్భగుడిలో బాల రాముడి విగ్రహం ఉంటుంది.

ఆలయంలో ఐదు మండపాలు నృత్యం, రంగమండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తనా మండపాలుంటాయి.

దివ్యాంగులు, వృద్ధుల కోసం లిఫ్టులు, ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.

ఆలయం నాలుగు మూలల నాలుగు ఆలయాలు సూర్య భగవానుడు, భగవతి, గణపతి, శివుడి ఆలయాలు నిర్మిస్తున్నారు. ప్రధాన ఆలయానికి ఉత్తర భుజంలో అన్నపూర్ణ అమ్మవారి ఆలయం.. దక్షిణ భుజంలో హనుమంతుడి ఆలయం ఉంటుంది.

పురాణకాలం నాటి సీతాకూపం కూడా ఆలయ సమీపంలోనే ఉంటుంది. వాల్మీకి , వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షుల, నిశద్‌రాజ్‌, శబరి, దేవిఅహల్య ఆలయాలను అక్కడ నిర్మిస్తున్నారు.

ఆలయం నిర్మాణంలో ఎక్కడా ఇనుము ఉపయోగించడం లేదు. ఆలయం కింద 14 మీటర్ల మందంతో రోలర్‌ కాంపాక్టు కాంక్రీట్‌ (ఆర్‌సీసీ) వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news