అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు రంగం సిద్ధం అవుతోంది. జనవరి 22వ తేదీన జరగనున్న ఈ మహత్తర కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. హిందూ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం ఈ క్రతువులను నిర్వహించనున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఇవాళ పరిహార క్రతువును నిర్వహించనుంది.సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ, గో సమర్పణ మొదలైన కార్యక్రమాలు జరపనున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందు నిర్వహించే పవిత్ర కార్యక్రమాలు జనవరి 16 నుంచి 21 వరకు జరగనున్నాయి.
జనవరి 16 నుంచి 21 వరకు జరగనున్న నిత్య క్రతువుల షెడ్యూల్ ఇదే
జనవరి 16 : ప్రాయశ్చిత్త, కర్మకుటి పూజ
జనవరి 17 : దేవాలయ ప్రాంగణంలోకి విగ్రహ ప్రవేశం
జనవరి 18 (సాయంత్రం) : తీర్థ పూజ, జలయాత్ర, జలధివాస్, గంధ ధివాస్
జనవరి 19 (ఉదయం) : ఔషధ ధివాస్, కేశర ధివాస్, ఘృతాధివాస్
జనవరి 19 (సాయంత్రం) : ధాన్యాధివాస్
జనవరి 20 (ఉదయం) : శక్రాధివాస్, ఫలధివాస్
జనవరి 20 (సాయంత్రం) : పుష్పాధివాస్
జనవరి 21 (ఉదయం) : మధ్యాధివాస్
జనవరి 22 (సాయంత్రం) : శయ్యాధివాస్