ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, పాక్, శ్రీలంకలపై గెలుపొంది ఆఫ్గాన్ టీం విశ్వరూపం చూపిస్తోంది. ఆ టీం ఈ స్థాయికి చేరుకోవడం వెనుక భారత్ ది కీలక పాత్ర. ఐసీసీలో అసోసియేట్ దేశంగా ఆ దేశానికి హోదా దక్కిన, 2015 వరల్డ్ కప్ కు అర్హత లభించిన, అంతా బీసీసీఐ వల్లనే. ఇదేకాక, భారత్ లోని స్టేడియాలను ఆఫ్గాన్ కు హోమ్ స్టేడియాలుగా ఇచ్చింది.
రషీద్, ముజీబ్, నబీ వంటి వారి ఎదుగుదలకు సైతం ఐపీఎల్ ఎంత తోడ్పడిందో తెలిసిందే. అయితే..శ్రీలంకపై అఫ్గానిస్థాన్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆఫ్గానిస్తాన్ ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ లో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసిన ఆఫ్గాన్… ఈసారి లంకను అవలీలగా దాటేసింది. సోమవారం జరిగిన పోరులో ఆఫ్గాన్ ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. దీంతో ఆడిన 6 మ్యాచుల్లో మూడు విజయాలతో ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆఫ్గాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది.