ఇప్పటికి చాలాసార్లు ట్రైన్ జర్నీ చేసి ఉంటారు కదా..! కానీ మనకు ట్రైన్ గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలియవు. ట్రైన్ మీద వేసే గుర్తులకు, ఆ నెంబర్లకు అర్థాలు ఉంటాయి. ట్రైన్ చివర్లో లాస్ట్ భోగి పైన X అని ఉంటుంది. దీనికి మీనింగ్ ఏంటో తెలుసా.. ఈ ట్రైన్ ఇక్కడితో అయిపోయింది అని.. ఎప్పుడైనా భోగీలు విడిపోయినా.. ఈ మార్క్‌ను బట్టి తెలుసుకోవచ్చు. అలాగే మీరు గమనించారో లేదో.. ట్రైన్‌లో ఏసీ భోగి ఎప్పుడు మధ్యలోనే ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది..?
జనరల్ కోచ్‌ల తర్వాత స్లీపర్ కోచ్ ఉంటుంది. కానీ అన్ని రైళ్లలో, రైలు మధ్యలో AC కోచ్‌లు ఉంటాయి. రైలు మధ్యలో ఏసీ కోచ్‌లు ఎందుకు పెట్టారో తెలుసా? ఈ నిర్ణయానికి భారతీయ రైల్వే నిర్దిష్ట కారణాన్ని వెల్లడించలేదు. AC కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇది సులభమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇస్తుందని నిపుణులు అంటున్నారు. మధ్యలో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులు లగేజీ కంపార్ట్‌మెంట్‌లుగా తక్కువ రద్దీని ఎదుర్కొంటారు, తర్వాత రైలుకు ఇరువైపులా జనరల్, స్లీపర్ కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. ఇక్కడ పెద్ద జనసమూహం కనిపిస్తుంది.
రైల్వే స్టేషన్ల ఎగ్జిట్ గేట్లు స్టేషన్ మధ్యలో ఉండడం మీరు గమనించి ఉండవచ్చు. అందువల్ల ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులు లగేజీతో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా ఎగ్జిట్ గేట్‌కి చేరుకుంటారు. బ్రిటీష్ కాలంలో స్టీమ్ ఇంజన్లున్నప్పుడు ఇంజన్ దగ్గర ఏసీ కోచ్ ఉండేది. అయితే ఇంజన్ శబ్ధం రావడంతో ఏసీ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అవస్థలు పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఏసీ బాక్సులను ఇంజన్‌కు దూరంగా ఉంచేవారట. సో.. అది మ్యాటర్.. ఇంకా ట్రైన్ గురించి మీకు తెలిసిన ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ ఏమైనా ఉన్నాయా..?