పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్‌పై లైంగిక ఆరోపణలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందిస్తూ ఓ ఆడియో రిలీజ్ చేసిన అనంతరం తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్లారు. తనపై వచ్చిన నిరాధార ఆరోపణలపై పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.
“రాజ్‌భవన్‌లో కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు దూరారు. వారు దురుద్దేశంతో ప్రతిష్ఠను భంగం చేయాలనే వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. దీనిపై వివిధ సంస్థలు సైతం దర్యాప్తు చేపట్టాయి. ఇవన్నీ కేవలం ఎన్నికల కోసం వేసిన ప్లాన్లు మాత్రమే.” అని ఆనంద్ బోస్ తన ఆడియో సందేశంలో పేర్కొన్నారు.
అంతకుముందు ఈ వార్తలపై ఎక్స్ వేదికగా స్పందించింది రాజ్‌భవన్ కార్యాలయం. “ఇద్దరు అసంతృప్త ఉద్యోగులు కొన్ని రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా మారి అసత్య కథనాలు ప్రచారం చేశారు. నిజం గెలుస్తుంది బంగాల్‌లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని వారు నిలువరించలేరు” అని రాజ్‌భవన్ కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.