గుడ్ న్యూస్.. భారత్‌ బ్రాండ్ గోధుమ పిండి కిలో రూ.27.50కే

-

భారతీయులకు శుభవార్త. ఇక నుంచి గోధుమ పిండి కేవలం రూ.27.50కే లభించనుంది. అదెలా అనుకుంటున్నారా.. గోధుమ పిండిని తక్కువ ధరకే వినియోగదారులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌ గోధుమ పిండి విక్రయాలను షురూ చేసింది. కిలో గోధుమ పిండి ప్యాకెట్‌ను రూ.27.50కే విక్రయిస్తున్నారు. నేషనల్‌ కో ఆపరేటివ్‌ కన్జ్యూమర్‌ ఫెడరేషన్‌, నేషనల్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌  ద్వారా దేశంలోని రెండు వేల దుకాణాలకు 800 వాహనాలు భారత్‌ దాల్‌, గోధుమ పిండి, ఉల్లిపాయలను సరఫరా చేస్తాయని కేంద్ర పౌరసఫరాల శాఖ వెల్లడించింది.

భారత్‌ గోధుమ పిండి కోసం భారత ఆహార సంస్థ నుంచి 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలను కేజీ రూ.21.5కే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏజెన్సీలకు కేటాయించినట్లు కేంద్ర ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌ తెలిపారు.  అక్కడ తయారైన పిండిని దేశవ్యాప్తంగా కేజీ రూ.27.50కే విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.  దేశంలో ఆహార పదార్ధాల ధరలు పెరిగిన ప్రతిసారీ వాటిని సేకరించి సబ్సిడీలో ప్రజలకు అందజేస్తున్నామని చెప్పారు.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్కెట్లో నాన్ బ్రాండెడ్‌ గోధుమ పిండి ధర కిలో రూ.36కు విక్రయిస్తుండగా.. ఏటా ఈ ధర 5.6 శాతం పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news