ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆవర్తనం ప్రభావంతో మరికొన్ని రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలో గత రెండు రోజులుగా పడుతున్న తేలికపాటి వర్షాలు ఈ నెల 15 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.
రాయలసీమ లో ఈ నెల 22 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లా ల్లో ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి’ అని వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, హైదరాబాద్, మెదక్, సిరిసిల్లా, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇవాళ హైదరాబాద్ లో వర్షం పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక అటు తెలంగాణ, ఏపీ లోని కొన్ని ప్రాంతాలలో… ఉదయం చలిగా, మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటోంది.