రాజకీయాలలో తమ ప్రత్యర్ధులపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు సరైన సమయం కోసం నేతలు ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి కూడా అలాంటి ఛాన్సే వచ్చింది. తన అరెస్టుని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ట్రంప్. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు డోనాల్డ్ ట్రంప్. బైడెన్ కి పూర్తిగా మతిభ్రమించిందని విమర్శించారు.
ఆయన చర్యల కారణంగా భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం సంభవించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దేశ సరిహద్దుల విషయంలో బైడెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సరిహద్దుల వద్ద ఎలాంటి రక్షణ గోడ లేకపోవడం వల్ల దేశం ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఆయుధాల సమీకరణలో బైడెన్ చర్యలు దేశ భవిష్యత్తుకు హాని కలిగిస్తాయన్నారు.