రిజర్వేషన్ల పెంపు బిల్లుకు బీహార్ అసెంబ్లీ ఆమోదం

-

రాష్ట్రంలో విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు బిల్లుకు బీహార్ అసెంబ్లీలో ఇవాళ ఆమోద్ర ముద్ర పడింది. కులాల వారీగా కోటా పెంచుతూ ఇటీవల సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో కేబినెట్ ప్రతిపాదించిన రిజర్వేషన్ సవరణ బిల్లును తాజాగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం నితీష్ కుమార్ సభలో లేకుండానే అసెంబ్లీ బిల్లు పాస్ అవ్వడం విశేషం. దీంతో బీహార్ రాష్ట్రంలో రిజర్వేషన్ కోటా 65 శాతానికి పెరిగింది. అయితే రిజర్వేషన్ల సవరణ బిల్లులో ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రస్తావించకపోవడంపై బీజేపీ రాష్ట్ర అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేసింది.

బిల్లుపై బీజేపీ అభ్యంతరం తెలపడంతో సీఎం నితీష్ కుమార్ కలుగజేసుకొని తన మాటలు వినాలనుకుంటేనే మాట్లాడాతనని స్పష్టం చేశారు. తొమ్మిది పార్టీల మద్దతుతో కుల ఆధారిత గణన జరిగింది అని.. దీని ద్వారా ప్రతీ ఒక్కరి ఆర్థిక పరిస్థితి పరిశీలించామని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే సభలో చెప్పినప్పటికీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే బిల్లు అమలు చేయాలని కోరుతున్నట్టు సీఎం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news