‘ఇండియా’ను చూసే NDA హడావుడి భేటీలు : బిహార్ సీఎం నీతీశ్‌

-

విపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’ను చూసి ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన చెందుతున్నారని బిహార్‌ సీఎం, జేడీయూ నేత నీతీశ్ కుమార్‌ అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అద్భుతమైన పనితీరు కనబరుస్తుందనే భయం మోదీకి పట్టుకుందని విమర్శించారు.

సంకీర్ణ ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్న సమయంలో ఏనాడూ సమావేశాల గురించి పట్టించుకోలేదని నీతీశ్‌ అన్నారు. ‘ఇండియా’ కూటమి సమావేశాలు నిర్వహిస్తుండటంతో హడావుడిగా సమావేశాలు నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో బీజేపీ తన మిత్రపక్షాలను గౌరవించడమే మానేసిందని ఆరోపించారు.

‘ఇండియా’ కూటమి సారథ్యం వహించిన నీతీశ్‌ రెండు నెలల క్రితం విపక్ష కూటమి తొలి సమావేశం జరగ్గా.. ఇండియా కూటమిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై నీతీశ్ మండిపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో  ‘ఇండియా’ కూటమి పనితీరు అద్భుతంగా, దేశానికి శుభసూచికంగా ఉంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news