ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలిస్తోంది. మధ్యప్రదేశ్‌ను బీజేపీ పాలిస్తుండగా.. మిజోరం భాగస్వామి పార్టీతో అధికారం పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లు ఉండగా తొలి విడతలో 39 పేర్లు ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోనూ ఐదుగురు చొప్పున మహిళలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలు ఉంటే 21 మందితో తొలి జాబితాను గురువారం విడుదల చేసింది.