గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక గుజరాత్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ ముందంజలో ఉంది. అటు హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో బిజెపి దూసుకుపోతోంది. 182 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికల్లో జరగకగా ప్రస్తుతం బిజెపి 128 స్థానాలలో ఆదిక్యం లో ఉంది. కాంగ్రెస్ పార్టీ 45 స్థానాల్లో అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాలలో అటు ఇండిపెండెట్స్ ఒక స్థానంలో ఆదిక్యం లో ఉన్నారు. గుజరాత్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మెజారిటీ మార్క్ 92 స్థానాలు కావాలి. కాగా గత 27 సంవత్సరాలుగా గుజరాత్ లో బిజెపి ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.