ఐదుగురితో బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితా

-

రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ రెండో జాబితాను ప్రకటించింది. ఐదుగురు అభ్యర్థులతో తాజాగా ఈ జాబితాను విడుదల చేసింది. ఒడిశా నుంచి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి మరో మంత్రి ఎల్‌. మురుగన్‌ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దఫా ఎన్నికైతే వీరివురు రెండోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ఒడిశాలో అశ్వినీ వైష్ణవ్‌కి అధికార బిజూ జనతాదళ్‌ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం ఐదు రాజ్యసభ స్థానాలకు పోటీ జరగనుండగా.. వీటిలో నాలుగు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది.

మధ్యప్రదేశ్ నుంచి మురుగన్‌తోపాటు ఉమేశ్‌ నాథ్‌ మహరాజ్‌, మాయ మరోలియా, బన్సీలాల్‌ గుర్జార్‌లను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. రాజస్థాన్‌లో ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు మాజీ మంత్రి చున్నీలాల్‌ గరాసియా, మాజీ ఎమ్మెల్యే మదన్‌ రాథోడ్‌లు పోటీ చేయనున్నట్లు తెలిపింది. గత ఆదివారం రాజ్యసభకు 14 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి విడత జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌ (7), బిహార్‌ (2), ఛత్తీస్‌గఢ్‌ (1), హరియాణా (1), కర్ణాటక(1), ఉత్తరాఖండ్‌ (1), పశ్చిమబెంగాల్‌ (1) రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థిత్వాలు ఇందులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news