దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా బీజేపీ సంకల్ప్‌ పత్ర మేనిఫెస్టో

-

దిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమం నిర్వహించారు. ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో మేనిఫెస్టో రూపొందించారు. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా సంకల్ప్‌ పత్ర మేనిఫెస్టో రూపొందించినట్లు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.

రాజ్‌నాథ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ మేనిఫెస్టో రూపొందించింది. మేనిఫెస్టో కోసం 15 లక్షల సలహాలు, సూచనలు పరిశీలించింది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. 14 అంశాలతో మేనిఫెస్టో తయారు చేశామని తెలిపారు. వికసిత్‌ భారత్ కోసం సంకల్ప్‌ పత్ర రూపొందించామని, మోదీ సూచనల మేరకు సంకల్ప్‌ పత్ర రూపొందించామని వెల్లడించారు.

‘నా నేతృత్వంలోనే పార్టీ సంకల్ప్ పత్ర తయారైంది. అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో సంకల్ప్ పత్ర తయారుచేశాం. బీజేపీ మాటలు, పనులు, ఆకాంక్షలన్నీ దేశహితం కోసమే. ఆత్మ నిర్భర్‌ భారత్‌ దిశగా ముందుకు దూసుకెళ్తున్నాం. 140 కోట్ల ప్రజలకు లాభం చేకూర్తే సరికొత్త ప్రణాళిక తయారు చేశాం. మేనిఫెస్టో కోసం నమో యాప్ ద్వారా 4 లక్షల సూచనలు వచ్చాయి.’ అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news