పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ పార్టీ సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే..నేటి నుంచి బిజెపి జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగనున్నాయి. ఢిల్లీలో నేటి నుంచి రెండ్రోజుల పాటూ బిజెపి జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగనున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం దిశా నిర్దేశం చేయనున్నారు బిజెపి అగ్రనేతలు.
భారత్ మండపంలో బిజెపి జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగనున్నాయి. ఇక ఈ సమావేశాలకు బీజీపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఈ సమావేశాల్లో దాదాపు 10 వేల మంది పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 స్థానాలు గెలిచేలా వ్యూహరచనలు చేస్తోంది. ముఖ్యంగా ఎన్డీఏతో కలిసి 400 స్థానాలు గెలిచేందుకు ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగానే..నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ సమావేశాలు జరుగనున్నాయి.