అయోధ్య రామ్ మందిర్కు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటికే రామాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రామ మందిరంతో సహా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను పేల్చివేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. మరికొన్ని రోజుల్లో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న వేళ ఇలా జరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులిద్దరూ పేలుళ్లకు పాల్పడతామని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. సీఎంతో పాటు ఎస్‌టీఎఫ్ చీఫ్ అమితాబ్ యశ్‌ను కూడా హత్య చేస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. పోస్టు ఆధారంగా నిందితులకు సంబంధించిన మెయిల్ అడ్రస్‌లను కనుగొన్నట్లు వెల్లడించారు. వీటిపై సాంకేతిక విశ్లేషణ అనంతరం నిందితులను ఓం ప్రకాశ్, తాహర్ సింగ్‌లుగా గుర్తించారమని.. వెంటనే వారిని అరెస్టు చెప్పారు. గోండాకు చెందిన వీరిద్దరూ పారామెడికల్ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. తాహర్ సింగ్ మొయిల్స్‌ను సృష్టించగా ప్రకాశ్ బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం.