దుమ్ములేపిన బాంబే ఐఐటీ విద్యార్ధులు.. 85 మందికి కోటికి పైగా వేతనం

-

క్యాంపస్ సెలక్షన్స్‌లో బాంబే ఐఐటీ స్టూడెంట్స్ దుమ్ములేపారు. 2023-24 నియామకాల సీజన్‌ ఫేజ్‌-1లో భాగంగా అధిక ప్యాకేజీలను సొంతం చేసుకుని సూప్ అనిపించుకుంటున్నారు. బాంబే ఐఐటీ విద్యార్ధుల్లో మొత్తం 1,188 మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ దక్కగా.. వీరిలో 63 మందికి అంతర్జాతీయ ఆఫర్లు కూడా వచ్చాయి. వీరిలో 85మందికి కోటి రూపాయల కంటే ఎక్కువ వేతనంతో జాబ్ ఆఫర్లు వచ్చాయి. అత్యధిక వార్షిక వేతనం రూ.3 కోట్లు. ఐఐటీ బాంబే నిర్వహించినక్యాంపస్ సెలక్షన్స్‌లో మొత్తం 388 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి.

యాక్సెంచర్‌, ఎయిర్‌బస్‌, యాపిల్‌, బార్‌క్లేస్‌, గూగుల్‌, జేపీ మోర్గాన్‌ చేజ్‌, మైక్రోసాఫ్ట్‌, టాటా గ్రూప్‌ వంటి ప్రఖ్యాత సంస్థలు క్యాపస్ సెలక్షన్స్‌కు వచ్చాయి. కొన్ని సంస్థలు నేరుగా, మరికొన్ని వర్చువల్‌గా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. తమ విద్యా సంస్థలో చదువుతోన్న 60 శాతం మంది విద్యార్థులు ఫేజ్-1లో ఉన్నారని చెబుతున్నారు ఐఐటీ అధికారులు. ఇందులో 63 మంది జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, సింగ్‌పూర్, హాంగ్‌కాంగ్ వంటి దేశాల్లో జాబ్ ఆఫర్లు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news