చంద్రబాబు బీసీ సదస్సు పై కొడాలి నాని కౌంటర్

-

చంద్రబాబు బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవ్వడూ నమ్మరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని తిరుగుతున్న చంద్రబాబు.. బీసీలను ఎలా వెన్నెముక అంటారు అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప.. బీసీల కోసం చంద్రబాబు ఏం పాటు పడ్డాడో చెప్పాలి.

ఓసీ రిజర్వ్డ్ పదవులను కూడా ఇస్తూ.. బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యతని ఇస్తున్నారు. సీఎం జగన్ 4 రాజ్యసభలు బీసీలకు ఇస్తే.. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఏం పాటు పడ్డాడో చెప్పాలి. చంద్రబాబు ఒక్క బీసీకి అయినా రాజ్యసభ సీటు ఇచ్చాడా..? విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు బీసీల ఆర్థిక ఉన్నతికి సీఎం జగన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. 2024లో చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news