బిర్యానీ కొనడానికి డబ్బివ్వలేదని.. 55సార్లు పొడిచి.. డ్యాన్స్ చేస్తూ పైశాచికం

-

బిర్యానీ కొనడానికి డబ్బివ్వలేదని ఓ మైనర్ బాలుడు మరో బాలుడిని కిరాతకంగా హత్య చేయడమే కాకుండా అత్యంత పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ దారుణ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. మంగళవారం రోజు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలోని ల్‌కమ్‌ కాలనీ ప్రాంతంలో మంగళవారం రాత్రి 11.15 ప్రాంతంలో నిందితుడు దారిన వెళుతున్న మైనర్‌ను అడ్డగించి.. బిర్యానీ కొనుక్కోవడానికి డబ్బులివ్వాలని డిమాండ్‌ చేశాడు. అందుకు అతడు నిరాకరించడంతో మద్యం మత్తులో ఉన్న నిందితుడు అతడిపై దాడికి తెగబడ్డాడు. మొదట గొంతు పిసికి ఊపిరి ఆడకుండా చేయగా అతడు స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అతడిని కత్తితో 55 సార్లు పొడిచి.. అక్కడితో ఆగకుండా అతణ్ని వీధిలో ఈడ్చుకుంటూ డ్యాన్స్ చేస్తూ అత్యంత పైశాచికంగా ప్రవర్తించాడు. బాధితుడి జుట్టు పట్టుకుని లేపి జేబులో నుంచి రూ.350 తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news