తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. తిరుమలలో 31 కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచివున్నారు. ఇక నిన్న ఒక్క రోజే టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పట్టింది.

నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 45,503 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 22,096 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లుగా నమోదు అయింది.

కాగా, టీటీడీ అధికారులు ఇవాళ శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి టికెట్ల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల, తిరుపతిలోని గదుల కోటా మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో దర్శన టికెట్లు, గదులను ముందస్తుగా బుక్‌ చేసుకోవచ్చని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news