దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు మరోసారి పైకెగిసాయి. నెల రోజుల నుంచి స్వల్పంగా నిలకడగా ఉంటూ వస్తున్న పెట్రోల్ ధరలు గత 2 రోజుల నుంచి కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర 16 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ రూ.80.57 నుంచి రూ.80.73 ధరకు చేరుకుందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కాసేపటి క్రితం ప్రకటన చేసింది. ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులో పెట్రోల్ ధర పెరిగింది.
ఈ నగరాల్లో 16 పైసలు పెరిగింది పెట్రోల్. ప్రస్తుతం దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.45 గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.87 గా ఉంది కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.30. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.83.38గా ఉందని పేర్కొన్నారు. అసలే కరోనా కాటుతో ఇబ్బంది పడుతున్న వాహనదారులకు ఈ పెట్రో ధరల పెంపు మరో భారంగా మారింది.