“ఉండిపోరాదే” అంటున్న అందాల ముద్దుగుమ్మ రాశీఖ‌న్నా..!

-

తన అందం, అభినయంతో తక్కువ కాలంలోనే తెలుగు, త‌మిళ చిత్రాల్లో మెప్పించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రాశీఖన్నా. నిత్యం సినిమాలతో బిజీబిజీగా ఉండే ఈ బ్యూటీ లాక్‌డౌన్ స‌మ‌యంలో మ్యూజిక్‌పై బాగా ఫోకస్ పెట్టింది. అంటే ఈ అందాల ముద్దుగుమ్మ మంచి సింగర్. ఇప్పటికే కొన్ని తెలుగు చిత్రాల్లో పాట‌లు కూడా పాడింది. గ‌త ఏడాది ‘ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రంలోనూ పాట పాడి అభిమానుల‌ను అల‌రించారు.

లాక్ డౌన్ తో షూటింగ్ లు లేక ఇంటికే పరిమితం అవ్వడంతో ఈ బ్యూటీ మ్యూజిక్‌పై బాగా కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా గిటార్ వాయిస్తూ ఉండిపోరాదే.. సాంగ్ ను పాడి అభిమానులను అలరించింది రాశీఖ‌న్నా. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసింది.. దీంతో అది కాస్తా వైరల్ గా మారింది. కాగా, ఇటీవలే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేసిన ఈ అందాల బ్యూటీ త‌మిళంలో కొన్ని సినిమాలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news