ర‌క్తం గ‌డ్డ క‌ట్టే చ‌లిలో బీఎస్ఎఫ్ జ‌వాన్ 40 సెక‌న్ల‌లో 47 పుష్అప్స్ .. వీడియో వైర‌ల్

మ‌న రాష్ట్రంలో కొంత చ‌లి వ‌స్తేనే ఉద‌యం తొమ్మిది గంట‌ల వ‌ర‌కు దుప్ప‌టి తీయ‌కుండా ప‌డుకుంటాం. కానీ బీఎస్ఎఫ్ సైనికులు మాత్రం మంచు ప‌డుతున్నా.. విధులు నిర్వ‌హిస్తారు. అంతే కాకుండా ర‌క్తం గ‌డ్డే చ‌లిలో కూడా బీఎస్ఎఫ్ జ‌వాన్లు సాహాసాలు చేస్తారు. తాజా గా ఒక జ‌వాన్ మంచు ప‌డుతున్నా.. చేసిన సాహాసం వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ముందుగా ఈ వీడియో ను బీఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ నుంచి వ‌చ్చింది. కాగ ఈ వీడియోలో రక్తం గ‌డ్డే చ‌లిలో.. మంచు ప‌డుతున్నా.. ప‌రుపులా ఉండే మంచుపై ఒక జ‌వాన్ కేవ‌లం 40 సెక‌న్ల‌లో 47 పుష్ఆప్స్ చేస్తాడు.

అలాగే మ‌రొక్క జ‌వాన్ ఒంటి చేతితో పుష్ఆప్స్ చేస్తాడు. ఈ రెండు వీడియోల‌ను ట్విట్ట‌ర్ లో పోస్టు చేసిన బీఎస్ఎఫ్.. ఫిట్ ఇండియా ఛాలెంజ్ అంటూ క్యాప్ష‌న్ పెట్టింది. కాగ ఈ రెండు వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ వీడియో లు ప్ర‌స్తుతం 30 వేల‌కు పైగా వ్యూస్ సంపాదించుకున్నాయి. అలాగే జ‌య‌హో ఇండియాన్ ఆర్మీ, సెల్యూట్ అంటు నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి ధైర్య సాహాసాలు చేసే సైనికులు ఉండ‌టం త‌మ అదృష్టం అని మ‌రి కొంత మంది ట్వీట్ చేస్తున్నారు.